కాలనీల సర్వతోముఖాభివృద్ధికి రాజీలేని కృషి.. ఎమ్మెల్యే
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాలనీల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన నిధుల కోసం రాజీలేని కృషిని కొనసాగిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
దిశ, కాప్రా : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాలనీల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన నిధుల కోసం రాజీలేని కృషిని కొనసాగిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శివ సాయి నగర్, ఇందిరానగర్ కాలనీ సంక్షేమ సంఘాల కార్యాలయాల్లో జరిగిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలు బస్తీలలో రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తు చేశారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గర పడుతున్న క్రమంలో రోడ్లు జంక్షన్ల అభివృద్ధి త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానని చెప్పారు.
పేదలు మధ్యతరగతి కుటుంబాలు నివాసముండే కాలనీలకు వెళ్లే కుషాయిగూడ, పోచమ్మ గుడి, డిమార్ట్, శివ సాయి నగర్, వాసవి శివానగర్ రహదారి గుంతల మయం అయిందని, బాక్స్ డ్రైన్ నిర్మాణంతో పాటు రోడ్డు నిర్మాణం అయ్యేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధులు నాయకులతో పాటు శివ సాయి నగర్, ఇందిరా నగర్, సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శి వర్గం సభ్యులు ఎంపల్లి పద్మా రెడ్డి, నేమురి మహేష్ గౌడ్, కొండగళ్ల అశోక్, బీవీ నరసింహారెడ్డి, రామబ్రహ్మం, బర్ల రామచంద్రారెడ్డి, కాసుల సురేష్, బాణాల రామకృష్ణారెడ్డి, షాబాద్ దామోదర్ రెడ్డి, సత్యనారాయణ, శివకుమార్, సత్యనారాయణ రెడ్డి, చంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.