ఉప్పల్ లో ఇద్దరు నకిలీ ఆర్టీవోలు..
ఉప్పల్ లో ఇద్దరు నకిలీ ఆర్టీవోలుగా చలామణి అవుతూ ఆర్టీవో అధికారుల మంటూ తమ కాంక్రీట్ మిల్లర్ వాహనాలను ఆపి అక్రమంగా వసూలు చేస్తున్నారని మిల్లర్లు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.
దిశ, ఉప్పల్ : ఉప్పల్ లో ఇద్దరు నకిలీ ఆర్టీవోలుగా చలామణి అవుతూ ఆర్టీవో అధికారుల మంటూ తమ కాంక్రీట్ మిల్లర్ వాహనాలను ఆపి అక్రమంగా వసూలు చేస్తున్నారని మిల్లర్లు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఉప్పల్, చిలకనగర్, నారపల్లి ఘట్కేసర్, మేడిపల్లి, జోడిమెట్ల, నాగోల్ పరిసర శివారు ప్రాంతాల్లో కాంక్రీట్ మిల్లర్ వాహనాలను పట్టుకొని కారు డ్రైవర్ వాహనదారుని దగ్గరికి వెళ్లి ఆర్టీవో కార్ లో ఉన్నారంటూ వేల రూపాయలు ప్రేమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వసూలు చేశారన్నారు.
నకిలీ ఆర్టీఓగా చలామణి అవుతూ సంవత్సరకాలంగా తమ వద్ద అక్రమంగా ప్రతిరోజు డబ్బులు వసూలు చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. దాదాపు 400 మంది బాధితులు ఉన్నారని కాంక్రీట్ మిల్లర్ ఓనర్స్ తెలిపారు. గురువారం ఉదయం 4 గంటలకు బాధితులు నకిలీ ఆర్టీవోను పట్టుకొని ఉప్పల్ పోలీస్ లకు అప్పజెప్పారు. ఒకర్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరొక వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.