దేశంలో బీఆర్ఎస్ కు తిరుగులేదు: మంత్రి మల్లారెడ్డి

దేశంలో బీఆర్ఎస్ కు తిరుగులేదని, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రాజెక్టులు తెలంగాణలోనే ఉన్నాయని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Update: 2023-05-06 16:54 GMT

దిశ, నాగారం: దేశంలో బీఆర్ఎస్ కు తిరుగులేదని, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రాజెక్టులు తెలంగాణలోనే ఉన్నాయని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం నాగారం మున్సిపాలిటీలోని ఆర్ఎల్ నగర్ లోని మారుతిగార్డెన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేల్ల శ్రీధర్ అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, వృద్ధులకు పెన్షన్లు, పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలతో దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అన్నారు.

నాగారం మున్సిపాలీటీ అభివృద్ధికి అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, నాగారం ఆదర్శవంతంగా నిలుస్తుందని తెలిపారు. డంపింగ్ యార్డ్ పాపం కాంగ్రెస్ దే అని, నూతన టెక్నాలజీతో వాసన రాకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో నాయకులు కొత్త ఉత్సాహాన్ని కనబరిచారు.  బీఆర్ఎస్ కు తిరుగులేదు... సీఎం కేసీఆర్ డోకాలేదు అంటూ కార్యకర్తలు  చేసిన నినాదాలతో సభ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. మురుగునీరు కాలనీలోకి రాకుండా పైపులైన్ తో మళ్లించి కలుషిత వాతావరణం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ముందుండి చేస్తుందన్నారు.

నాగారం మున్సిపల్ చైర్మన్  మాట్లాడుతూ నాగారం అభివృద్ధిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం మంత్రి సమక్షంలో టీడీపీ, బీజేపీ 20 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ మల్లేష్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తేల్ల శ్రీధర్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు: కేటీఆర్

Tags:    

Similar News