జైన్ సమాజ్ సంప్రదాయాలు గొప్పవి : గవర్నర్

అక్షయ తృతీయ సందర్భంగా జైన్ సమాజం ఆధ్వర్యంలో సంవత్సర కాలంగా ప్రత్యేక ఉపవాస దీక్షలు చేపట్టడం గొప్ప విషయమని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు.

Update: 2023-04-21 17:32 GMT

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి : అక్షయ తృతీయ సందర్భంగా జైన్ సమాజం ఆధ్వర్యంలో సంవత్సర కాలంగా ప్రత్యేక ఉపవాస దీక్షలు చేపట్టడం గొప్ప విషయమని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. సికింద్రాబాద్ జైన్ సమాజ్ ఆధ్వర్యంలో సిఖ్ విలేజ్ జైన్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళ సై సౌందర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జైన్ సమాజం ఆచరించే సంప్రదాయాలు గొప్పవని, భగవాన్ ఆచార్య స్మరణలో ఉంటూ భక్తిశ్రద్ధలతో ఆయనకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏడాది పాటు ఉపవాసదీక్షలు కొనసాగించడం వారిలో ఉన్న ఆధ్యాత్మిక భావనలను వ్యక్తపరుస్తుందని అన్నారు.

జైన్ సమాజం చేస్తున్న అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంఘిక కార్యకలాపాలపై గవర్నర్ తమిళ్ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న జైన గురువులు ఆచార్యులు 500 మందికి పైగా స్వాగత కార్యక్రమం కూడా ఉంటుందని వారి దీవెనలు జైన సమాజం పైన ప్రసరించేలా ప్రవచనాలు కూడా ఉంటాయని తెలిపారు. అక్షయ తృతీయను పురస్కరించుకొని మూడు రోజులపాటు ప్రవచనాలు ర్యాలీలు సమావేశాలతో జన సమాజం ఐక్యతను చాటుతున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News