మాజీ ప్రధాని "మన్మోహన్ సింగ్" సేవలు మరువలేనివి.. నత్తి మైసయ్య
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 306 వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
దిశ, మేడిపల్లి : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 306 వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక సంస్కరణలు చేశారని, సాధారణ కుటుంబం నుండి అంచలంచెలుగా ప్రధాని స్థాయికి ఎదిగిన మహానీయుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఆయన సేవలు మరువలేనివని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా ఖండిస్తున్నారని క్షమాపణ చెప్పాలని నత్తి మైసయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, రాపోలు శ్రీరాములు, గరుగుల యాకయ్య, వై శ్రీనివాస్, బండారి సాయి, సవరపు బయన్న, జై భీమ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.