ప్రామాణికలతో కూడిన విద్య,వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా విద్యని నిర్వీర్యం చేసిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు.

Update: 2024-07-02 15:08 GMT

దిశ,కంటోన్మెంట్ / బోయిన్ పల్లి : గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా విద్యని నిర్వీర్యం చేసిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. తమ ప్రభుత్వం విద్య ,వైద్యం పై బృహత్తర కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి తెలిపారు. మంగళవారం కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ ఉమెన్ కాలేజ్ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి,అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కస్తూరిబా కాలేజ్ ఏర్పడి యాబై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలేజ్ యాజమాన్యానికి, విద్యార్థుల కు ,సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. గత యాబై సంవత్సరాలుగా విద్యలో ఎంతగానో కృషి చేసిన ఈ కాలేజీ అనేక మందిని సొసైటీకి అందించిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తాను ఇదే కాలేజీ పూర్వ విద్యార్థినని,ఈ కాలేజీ లో చదివినందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ కాలేజీ లో టీచర్స్ విద్య తోపాటు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చేవారని మల్లు నందిని తెలిపారు.

Similar News