ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి

కూకట్​పల్లి నియోజకవర్గంలో చెరువు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం గురువారం హైడ్రా కమిషనర్​ ఏవీ. రంగనాథ్​ను కలిసి వినతి పత్రం అందజేశారు.

Update: 2024-08-29 13:18 GMT

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి నియోజకవర్గంలో చెరువు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం గురువారం హైడ్రా కమిషనర్​ ఏవీ. రంగనాథ్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యం శ్రీరంగం మాట్లడుతూ కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలో కనుమరుగు అవుతున్న చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కూకట్​పల్లిలోని చెరువులు, నాలాల పూర్తి వివరాలను రంగనాథ్​కు అందించారు.

    సత్యం మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధి ప్రోద్బలంతో కూకట్​పల్లి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలకు హద్దూ అదుపు లేకుండా పోయిందని, ఆ ఆక్రమణలలో భీముని కుంట, కాముని చెరువు, రంగథాముని చెరువు, సున్నం చెరువు, నల్ల చెరువు, మైసమ్మ చెరువు, ముండ్ల కత్వ చెరువు, ఖజా కుంట చెరువు, కైత్లపూర్​ కుంటలు కూడా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా కూకట్‌పల్లిలో నాలాలు 150 ఫీట్ల వెడల్పు నుంచి 40 ఫీట్లకు చేరుకున్నాయని అన్నారు. బోయిన్ పల్లి డివిజన్​లోని బోయిన్ చెరువు, నాలా ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు.

    అదే విధంగా మైసమ్మ చెరువు, రంగధాముని చెరువు సుందరీకరణ పేరుతో చెరువును పూర్తిగా కబ్జా చేశారని, దీని ఫలితంగా సహజ నీటి వనరులకు ముప్పు ఏర్పడిందని అన్నరు. కూకట్​పల్లిలోని చెరువులపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలను తెలుసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలకు, చెరువులలో నిర్మించిన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన తెలిపారు.

Tags:    

Similar News