Disha Effect : ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు తొలగింపు

బడా బిల్డర్ బరితెగింపు, ప్రభుత్వ స్థలంలో దర్జాగా సీసీ రోడ్డు నిర్మాణం అని దిశ వెబ్ లింక్ లో ఆదివారం వెలువడిన కథనానికి అధికారులు స్పందించారు.

Update: 2024-10-07 09:48 GMT

దిశ, దుండిగల్ : బడా బిల్డర్ బరితెగింపు, ప్రభుత్వ స్థలంలో దర్జాగా సీసీ రోడ్డు నిర్మాణం అని దిశ వెబ్ లింక్ లో ఆదివారం వెలువడిన కథనానికి అధికారులు స్పందించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సోమవారం సారే గూడెం స్మశానవాటికలో త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ నిర్మించిన సీసీ రోడ్డు ను ఉన్నతాధికారుల ఆదేశాలతో జేసీబీ సహాయంతో తొలగించారు. త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ నిర్మాణ దారుడు పసుపులేటి సుధాకర్ ల్యాండ్ మార్క్-5 వెంచర్ కోసం సర్వే నంబర్ 200/1 ప్రభుత్వ భూమిని ఆక్రమించి, డిపి పల్లి మల్లన్న గుడి నుండి ల్యాండ్ మార్క్-5 వరకు సుమారు రూ. 90 లక్షల వ్యయంతో 40 ఫీట్ రోడ్డు నిర్మాణానికి అధికారుల అనుమతి లేకుండా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సగం రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన స్థానిక మున్సిపల్,రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు ప్రభుత్వ స్థలంలో అధికారుల అనుమతి లేకుండా నిర్మించిన సీసీ రోడ్డును జేసీబీ సహాయంతో తొలగించారు.


Similar News