ప్రజా సంక్షేమమే ధ్యేయం
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేయర్ శాంతి పేర్కొన్నారు.
దిశ,జవహర్ నగర్ : ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేయర్ శాంతి పేర్కొన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సుచరిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ ఈటెల, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేయర్ శాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సంక్షేమంలో రాజీ పడేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబెర్స్, స్థానిక సీనియర్ నాయకులు, మహిళలు ఉన్నారు.