hand over : తప్పిపోయిన ఒరిస్సా బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

తమకుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు జీడిమెట్ల పోలీసులు

Update: 2024-07-27 10:28 GMT

దిశ, పేట్ బషీరాబాద్: తమకుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు జీడిమెట్ల పోలీసులు. ఒరిస్సా నుంచి ఉపాధి నిమిత్తం రంజాన్ మాంజి, బసంతి లు కుమారుడు ఆయుష్ (7) తో కలిసి జీడిమెట్ల కు తరలివచ్చారు. వీరికి ఒరియా భాష తప్ప మరే భాష తెలియదు. ఈ క్రమంలో వారి కుమారుడు ఆయుష్ ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుడి జాడ తెలియక తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐ మల్లేష్ సిబ్బందితో కలిసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేశారు. దీంతో బాలుడి ఆచూకీ లభ్యం కావడం తో పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి తల్లిదండ్రులను పిలిపించి బాలుడిని వారికి అందజేశారు.


Similar News