గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అరెస్టు

ఈస్ట్ గోదావరి నుంచి గంజాయిని తీసుకు వచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కెపిహెచ్బి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Update: 2024-10-18 03:58 GMT

దిశ, కూకట్ పల్లి: ఈస్ట్ గోదావరి నుంచి గంజాయిని తీసుకు వచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కెపిహెచ్బి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కెపిహెచ్బి కాలనీ 5వ ఫేజ్ డీ మార్ట్ వద్ద నలుగురు యువకులు గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గోదావరి జిల్లాకు చెందిన తొరటి రాజేష్(24), తంగెళ్ళ రమేష్(27), జంపని సాయి గోపి విహారి(26), నక్క నాగ వంశి(23), సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు గా పని చేస్తున్నారు. గోదావరి నుంచి గంజాయిని తీసుకు వచ్చి నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News