రూ.5.45 కోట్లతో పోచారం మున్సిపల్ అభివృద్ధి..
పోచారం మున్సిపాలిటీని రూ.5.45 కోట్లతో అభివృద్ధి చేసేందుకు
దిశ, ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీని రూ.5.45 కోట్లతో అభివృద్ధి చేసేందుకు తీర్మానం చేసినట్లు పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కొండల్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు దివంగత 8వ వార్డు కౌన్సిలర్ బైరా హిమ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరమత్తులు, పారిశుధ్య సిబ్బంది పనిముట్లు, సామగ్రి కొనుగోలు, స్వచ్చ సర్వేక్షన్, అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రానికి మెయిన్టెనెన్స్ , స్టేషనరీ కొనుగోలు, కొత్తగా విలీన గ్రామాల సిబ్బంది జీతాలు మొత్తంగా రూ. ఐదు కోట్ల 45లక్షల పనులకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ప్రధానంగా యంనంపేటలోని శ్రీనిధి కాలేజీ, రాక్ ఉడ్ ఇంటర్నేషనల్ పాఠశాలల టాక్స్ రీ అసెస్మెంట్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, కౌన్సిలర్లు, మేనేజర్ అంజన్ రెడ్డి,ఏఈ మహిపాల్, మున్సిపల్ సిబ్బంది, పాల్గొన్నారు.