సంస్కృతి టౌన్షిప్ అభివృద్ధికి కృషి. పార్టీలకతీతంగా కొత్త ప్యానల్ ఏర్పాటు..

పోచారం మున్సిపాలిటీ పరిధిలో సంస్కృతి టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్

Update: 2024-12-19 11:53 GMT

దిశ, ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీ పరిధిలో సంస్కృతి టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా సంచలనం సృష్టించనున్నట్లు సంస్కృతి టౌన్షిప్ అధ్యక్షుడు బి. హరి ప్రసాద్ రావు అన్నారు. గురువారం టౌన్షిప్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరి ప్రసాద్ రావు మాట్లాడుతూ...ఈనెల 22న సంస్కృతి టౌన్షిప్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికల్లో పోటీ చేసే తమ ప్యానెల్ అభ్యర్థులను పరిచయం చేశారు. అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు. 20 ఏళ్ల కాలంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచామే తప్ప అభివృద్ధి విషయంలో కొంత వెనుక పడ్డామన్నారు.

కొందరు ఒంటెద్దు పోకడ వల్ల అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి ఈసారి కేవలం టౌన్షిప్ అభివృద్ధి కోసమే కృషి చేసే అభ్యర్థులతో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తమ ప్యానెల్ గెలుపొందిన తర్వాత ఎన్నికల ప్రచారంలో మొదటి ఎజెండా అంశం టౌన్షిప్ లో శాశ్వత వాణిజ్య భవన సముదాయ నిర్మాణంతో పాటు అని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. సంస్కృతి టౌన్షిప్ లో 2080 ఫ్లాట్స్ ఉండగా 1650 ఓనర్లు మాత్రమే ఓటు వేసే అర్హత కలిగి ఉన్నారన్నారు. అన్ని పార్టీల నాయకుల మద్దతుతో ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తాం అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి, కె ఎస్ ఆర్ మూర్తి, రజనీకాంత్, వెంకట్ రెడ్డి, సరిత, జోగేశ్వరరావు, ప్రతిభ, ప్రగతి, కొండయ్య, శ్రీనివాస్, మంజుల, తదితరులు పాల్గొన్నారు.


Similar News