కంటోన్మెంట్ కు రూ.40 కోట్లు తక్షణమే చెల్లించాలి : జె.రామకృష్ణ

కంటోన్మెంట్ బోర్డుకు రూ.40 కోట్ల టీపీటీ బకాయిలను చెల్లించాలని

Update: 2024-12-19 13:04 GMT

దిశ, కంటోన్మెంట్ : కంటోన్మెంట్ బోర్డుకు రూ.40 కోట్ల టీపీటీ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని బోర్డు నామినేటెడ్ సభ్యులు జె. రామకృష్ణ అన్నారు. గురువారం మహేంద్ర హిల్స్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ వివరాలను వెల్లడించారు. టీపీటీ బకాయిల కోసం గత కొంత కాలంగా తాను న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లు టీపీటీ బకాయిలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వంపై కేసు రూ.80 కోట్లు రాబట్టినట్లు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు కు ఇవ్వవలసిన రూ.40 కోట్ల బకాయిలు ఇవ్వలేనందున, బీజేపీ తరఫున హైకోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం పై కేసు వేశామన్నారు.

దీనిపై మూడు నెలలుగా అనేక చర్చలు, వాదోపవాదనలు జరిగాయని, చివరకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని మళ్ళీ కేసు వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున లాయర్ కోర్టును కోరగా కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి బుధవారం రూ.40 కోట్లు తక్షణమే చెల్లించాలని తీర్పును వెలువరించినట్లు తెలిపారు. కోర్టుకు వెళితే తప్ప కంటోన్మెంట్ కు రావాల్సిన టీపీటీ బకాయిలు రావడం లేదన్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి నాడు ఎంపీగా పనిచేసిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్దిని పట్టించుకోవడం లేదన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారన్నారు., కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఒక్క పైసా కూడా కేటాయించడం లేదని సరిపడా తాగునీరు కూడా ఇవ్వడం లేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నగరం నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ప్రజల అవసరాలకు సరిపోయే విధంగా తాగునీటి సరఫరా చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.


Similar News