ప్రజల జీవితాలలో వెలుగులు నిండాలే
ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు 2025 సంవత్సరం దోహద పడాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు.
దిశ, కుత్బుల్లాపూర్ : ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు 2025 సంవత్సరం దోహద పడాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. గాజులరామారంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలు ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రజలు మాజీ ఎమ్మెల్యేని బుధవారం కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు.