కంటోన్మెంట్ అడ్డా.. బీఆర్ఎస్ అడ్డా..
కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికలలో అధిష్టానం ఎంపిక చేసిన బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి : కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికలలో అధిష్టానం ఎంపిక చేసిన బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ మల్లారెడ్డి గార్డెన్ లో బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రావణ్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, క్రిశాంక్ లు హాజరయ్యారు.
మంత్రులు మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాయకులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మీ దగ్గరికి వస్తే ఏమి చేశారో అడిగి, తరిమి కొట్టాలన్నారు. ఉద్యమ కారులు అసంతృప్తి ఉన్నారనేది వాస్తవమే అని ఖచ్చితంగా వారికి రానున్న రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. పార్టీ కార్యక్రమాలను సంబంధించి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనంతరం అనేక అభివృద్ధి సంక్షేమ, పథకాలు అమలు చేసి పేదప్రజల జీవితంలో వెలుగులు నింపామని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరి ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
రాబోయే ఎన్నికలలో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రజలకు, కార్యకర్తలను కోరారు. కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ ప్రజలకు అర్ధమయ్యే విధంగా పోస్టర్స్ తో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పథకాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ తెలంగాణ పై వివక్ష చూపుతున్న తీరును ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లు రాకపోవడం చూస్తుంటే మళ్ళీ గ్రూప్ రాజకీయాలకు తావిస్తోందేమో అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం అతిథులను అందరిని జక్కుల మహేశ్వర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డ్ సభ్యులు పాండు యాదవ్, లోక్ నాథం, భాగ్యశ్రీ, నళిని కిరణ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, ప్రవీణ్ యాదవ్, రాజుసింగ్, ఉద్యమ కారులు నర్సింహ యాదవ్, ప్రభుగుప్త, నర్సింహ, శ్రీనివాస్, రాము, పద్మ, మీనా భాస్కర్ తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.