నకిలీ విత్తనాలు పట్టివేత… వివరాలు వెల్లడిస్తున్న మేడ్చల్ డీసీసీ

మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెంజ్ బౌల్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-07-02 12:59 GMT

దిశ,మేడ్చల్ టౌన్: మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెంజ్ బౌల్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు పట్టుకున్నారు. శామీర్పేట్ పోలీసులు మేడ్చల్ ఎస్ ఓ టీం ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది వందల కిలోల పత్తి విత్తనాలతో పాటు, విత్తనాలు తరలిస్తున్న డీసీఎం వ్యాన్, డ్రైవర్ మల్లేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ డీసీసీ కోటిరెడ్డి తెలిపారు. శామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నకిలీ విత్తనాలు పట్టివేతకు సంబంధించిన వివరాలను కోటిరెడ్డి వివరించారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేంద్రంగా నకిలీ విత్తనాలు తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని, ప్రస్తుతం పట్టుబడిన 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు సూర్యాపేట నుంచి బెల్లంపల్లికి తరలిస్తుండగా విశ్వాసనీయ సమాచారంతో షామీర్పేటలోని ఆరెంజ్ చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నట్లు డీసీసీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ పోలీస్ సిబ్బంది నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హారిక, మునీందర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News