మల్లారెడ్డి విద్యా సంస్థలకు మా బ్యాంక్‌లో అకౌంట్ లేదు: సీఈఓ సీతా రాములు
మంత్రి మల్లారెడ్డికి క్రాంతి బ్యాంకుకు ఎటువంటి సంబంధం లేదని ఆ బ్యాంకు సీఈఓ సీతారాములు ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ, బాలానగర్: మంత్రి మల్లారెడ్డికి క్రాంతి బ్యాంకుకు ఎటువంటి సంబంధం లేదని ఆ బ్యాంకు సీఈఓ సీతారాములు ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బబ్బుల రాజేశ్వర రావు మా సంస్థలో ఒక డైరెక్టర్ మాత్రమేనని.. ఐటీ అధికారులు రాజేశ్వర రావు అకౌంటును చెక్ చేయడానికి మాత్రమే వచ్చారని, అలాగే మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అకౌంట్లు కూడా ఏమీ లేవని తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం నాడు
ఐటీ అధికారులు బబ్బుల రాజేశ్వర రావు కోడలిని బాలానగర్ క్రాంతి బ్యాంక్‌కు తీసుకు వచ్చి ఒక లాకర్‌ను ఓపెన్ చేయించారు. అయితే 50 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు మల్లారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో చేసిన తనిఖీల్లో వేర్వేరు చోట్ల దాదాపు రూ.4 కోట్ల నగదును, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన సీడీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.