సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు..

సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకెపీ కొనుగోలు కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం ఘననీయంగా పెంచే విధంగా నిర్ణయించిందని తలను కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ పేర్కొన్నారు.

Update: 2025-03-27 17:03 GMT
సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు..
  • whatsapp icon

దిశ, మేడ్చల్ బ్యూరో : సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకెపీ కొనుగోలు కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం ఘననీయంగా పెంచే విధంగా నిర్ణయించిందని తలను కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయం నుంచి గురువారం నిర్మించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం స్థానిక సంస్థల అధికారి కలెక్టర్ రాధిక గుప్తా, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధికారులకు కొన్ని సూచనలు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించాలని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినందుకు పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సిన కమిషన్ విషయంలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమీక్ష నిర్వహించి పెండింగ్ కమిషన్ చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని, గన్ని బ్యాగులు రీకన్సిలేషన్ ప్రక్రియ చేపట్టాలని అన్నారు.

కుటుంబంలో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వృద్దులు ఎవరైనా మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ లకు సూచించారు. డీఆర్డీఓ, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమీషనర్లతో సమావేశం నిర్వహించి ఇటువంటి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ముందుగా జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సాంబశివరావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుగుణబాయి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి చంద్రకళ, డీఈఓ విజయ కుమారి, ఎల్డీఎం శివప్రసాద్, మెప్మా పీడీ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News