మహ్మద్‌ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలి.. మహమ్మద్ షఫీ..

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రంజాన్‌ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.

Update: 2025-03-31 12:08 GMT
మహ్మద్‌ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలి.. మహమ్మద్ షఫీ..
  • whatsapp icon

దిశ, మేడిపల్లి : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రంజాన్‌ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నగరంలోని ప్రఖ్యాత కుతుబ్ షాహీ ఆలంగీర్ మస్జీద్ నందు ముస్లింలు ప్రత్యేక “ఈదుల్ ఫితర్“ ప్రార్థనలు నిర్వహించారు. మతపెద్ద మొహమ్మద్ షఫీ రంజాన్‌ సందేశంలో భాగంగా ప్రతివ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తనకు ఉన్నదాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రతిఒక్కరూ మహ్మద్‌ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. అనంతరం ఒకరికొకరు అలాయ్ బలాయ్ చేసుకుంటా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ తాజుద్దీన్, మహబూబ్ అలీ, షఫీ, ఉరూజ్, ఫిరోజ్,అబ్బాస్, నిజాం, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News