ఫ్రీ లాంచింగ్ పేరుతో క్రీతిక ఇన్ఫ్రా డెవలపర్స్ భారీ మోసం
ఫ్రీ లాంచింగ్ పేరుతో క్రీతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ సుమారు
దిశ,ఉప్పల్: ఫ్రీ లాంచింగ్ పేరుతో క్రీతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ సుమారు 180 మంది కస్టమర్ల నుంచి సుమారు రూ.70 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారని భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి విడతగా 140 మంది కస్టమర్ల నుంచి రూ.38 లక్షల చొప్పున రూ.54 కోట్లు తీసుకొని ఒక్కరికీ 40 గజాలు రిజిస్ట్రేషన్ చేశారు.కానీ మళ్ళీ అదే స్థలాన్ని మిగతా 40 మందికి చేస్తానని కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓ శ్రీకాంత్ ఉప్పల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు రావడంతో విషయం తెలుసుకొని మొత్తం బాధితులు ఉప్పల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు వచ్చి ప్లకార్డ్స్ తో నిరసన తెలిపారు. దీంతో సీఈఓ శ్రీకాంత్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని హేమ నగర్ లో రెండున్నర ఎకరాల స్థలాన్ని 2020 లో కొనుగోలు చేస్తున్నానని చెప్పి క్రితిక ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓ శ్రీకాంత్ 54 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశాడు.కానీ శ్రీకాంత్ 2 ఎకరాల స్థలం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ స్థలాన్ని 140 మందికి రిజిస్ట్రేషన్ చేయించాడు.కానీ ఇంకా 40 మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదు.
బాధితుల వివరణ..
మేము 2020,2021,2022,2023 ఇలా ప్రతీ సంవత్సరం ఒక్కో కస్టమర్ ను నమ్మించి డబ్బులు వసూలు చేశాడు.నేటికీ ఐదు సంవత్సరాలు కావస్తున్నా మాకు ఎలాంటి పొజిషన్ ఇవ్వడం లేదు. అపార్ట్మెంట్ కట్టి ఇవ్వడం లేదు.మాకు చేసిన స్థలాన్ని మళ్ళీ మిగతా 40 మందికి చేస్తారేమో మాలో మాకు గొడవ పెడుతూ శ్రీకాంత్ కాలయాపన చేస్తున్నాడు.దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ మ్యాటర్ అంటూ దాటవేస్తున్నారు.కాబట్టి ప్రభుత్వం చొరవ చూపి మా డబ్బులు మాకు,లేదా మా అపార్ట్మెంట్ మాకు ఇప్పించగలరని కోరుతున్నారు.