రూ.6.80 కోట్లతో ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి..

ఘట్కేసర్ మున్సిపాలిటీని అన్ని రంగాల అభివృద్ధి చేసేందుకు కృషి

Update: 2025-01-07 12:35 GMT

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపాలిటీని అన్ని రంగాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పావని జంగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో రూ.6.80 కోట్ల నిధులతో మున్సిపాలిటీ అభివృద్ధి చేసేందుకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని మాట్లాడుతూ.. ఘట్కేసర్ మున్సిపాలిటీతో పాటు విలీనమైన గ్రామాలలో అభివృద్ధి పనుల్లో భాగంగా సిమెంట్ రోడ్లకుగాను రూ. 410.00 లక్షలు, భూగర్భ డ్రైనేజిలు వేయుటకు గాను రూ.120.00 లక్షలు , మంచి నీటి పైప్ లైన్ వేయుటకు గాను రూ.25.00 లక్షలు, ఓపెన్ జిమ్ లకు రూ.22.00 లక్షలు, సిమెంట్ రోడ్డు మరమ్మతులకు రూ. 15.00 లక్షలు, స్ట్రీట్ లైట్ మరమత్తులు రూ.10.00 లక్షలు, శానిటేషన్ వాహనముల మరమత్తులు రూ.10.00 లక్షలు, ఇతర పనుల నిమిత్తము రూ18.00 లక్షలు లక్కీ వైన్స్ నుంచి సాయి నికిత వెంచర్ వరకు రూ.50 లక్షలతో తారు రోడ్డు కోసం మొత్తంగా పనులు రూ.680.00 లక్షలతో అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేయాలని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు వివరించారు. సమావేశంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు , అసిస్టెంట్ ఇంజినీర్ పి.రాకేష్ , మేనేజర్ వెంకట్ రెడ్డి , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News