డిజిటల్ రంగంలో ‘దిశ’ ప్రభంజనం: ఎంపీ ఈటల రాజేందర్
డిజిటల్ రంగంలో దిశ ప్రభంజనం అని మల్కాజిగిరి ఎంపీ ఈటల
దిశ,కూకట్ పల్లి: డిజిటల్ రంగంలో దిశ ప్రభంజనం అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. దిశ దినపత్రిక మేడ్చల్ జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎంపీ ఈటల రాజేందర్ శామీర్ పేట లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. అనతి కాలంలోనే దిశ పత్రిక ప్రజల ఆదరణను చూరగొన్నదని అన్నారు. వాస్తవాలను నిష్పక్షపాతంగా చేరవేస్తూ ఏ రాజకీయ పార్టీకి వంతు పాడకుండా నిజాలను నిర్భయంగా రాస్తున్న దిశ పత్రిక యాజమాన్యానికి, జర్నలిస్ట్ లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ప్రభాకర్ ,మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పట్లోల్ల విక్రమ్ రెడ్డి సీనియర్ నాయకులు నందా రెడ్డి,ప్రీతం,దిశ మేడ్చల్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ కల్లెపల్లి రవి చంద్ర, మల్కాజిగిరి ఇన్చార్జి శ్రీనివాస్, కూకట్ పల్లి ఇన్చార్జి ఏం ఏ. కరీం, మేడిపల్లి మండల విలేకరి రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.