మంత్రి.. ఎమ్మెల్యే అంటే నాలా ఉండాలి
సహకార సంఘాలు రైతుల ఆస్తి అని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు.
దిశ, శామీర్ పేట్ : సహకార సంఘాలు రైతుల ఆస్తి అని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా శామీర్ పేట , మూడు చింతలపల్లి మండలాల వ్యవసాయ సలహా దారుల సహకార సంఘాలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. బుధవారం మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో రూ. 94 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ సలహాదారుల సహకార సంఘం నూతన భవనాన్ని మల్లారెడ్డి డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఎమ్మెల్యే అంటే నాలా ఉండాలని, దేశంలోనే ఆదర్శవంతంగా శామీర్ పేట, మూడు చింతలపల్లి మండలాల వ్యవసాయ సలహాదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సహకార సంఘం వలన రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయన్నారు. ఈ భవనాలు రైతుల ఆస్తి అన్నారు. రైతులు ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సంఘం వలన తక్కువ వడ్డీలకే రుణాలు అందుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సహకార సంఘం డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, మండల తహసీల్దార్ వెంకట నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.