పొంగులేటిని సన్మానించిన శ్యాంసన్ రాజు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్యాంసన్ రాజు, మహిళ నాయకురాలు పద్మలు కలిసి శుభకాంక్షలు తెలియజేశారు.
దిశ, కంటోన్మెంట్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్యాంసన్ రాజు, మహిళ నాయకురాలు పద్మలు కలిసి శుభకాంక్షలు తెలియజేశారు. శనివారం జూబ్లీ హిల్స్ తోని తన నివాసంలో మంత్రిని శాలువాతో సత్కరించి, పూలబోకే అందజేసి శ్యాంసన్ రాజు దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్యాంసన్ రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కంటోన్మెంట్ అభివృద్ది పై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడ మర్తి రవి, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నానగర్ మురళీ, మహేష్, బాలరాజు, వరప్రసాద్, అజయ్ కుమార్, ఎన్ఐఎస్ కార్యదర్శి రాహుల్, నర్సింగ్, నిశాంత్, సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.