వారి కృషి వల్ల దానికి రక్షణశాఖ అంగీకారం.. బీఆర్ఎస్ నాయకులు హర్షం

పలు రహదారుల మార్గాల్లో డబుల్ డెక్కర్, మెట్రో ఫ్లై ఓవర్లకు లైన్ క్లియర్ చేయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ.. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు

Update: 2023-08-13 10:09 GMT

దిశ, మేడ్చల్ టౌన్: పలు రహదారుల మార్గాల్లో డబుల్ డెక్కర్, మెట్రో ఫ్లై ఓవర్లకు లైన్ క్లియర్ చేయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ.. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి వల్ల డబుల్ డెక్కర్, మెట్రో ఫ్లై ఓవర్లకు ఆర్మీ, కంటోన్మెంట్‌‌కు సంబంధించిన భూములు అప్పగించేందుకు రక్షణశాఖ అంగీకారం తెలిపిందన్నారు.

రాజీవ్ రహదారి, నాగపూర హైవే మార్గాల్లో రెండు ప్రాజెక్టులకు అడ్డంకులు తొలిగిపోయాయన్నారు. డబుల్ డెక్కర్, మెట్రో ఫ్లై ఓవర్ల వల్ల సికింద్రాబాద్, కంటోన్మెంట్, బోయిన్ పల్లి, అల్వాల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీరనుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ ఛైర్మన్ సత్యనారాయణ, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, యూత్ ప్రెసిడెంట్ హరత్ రెడ్డి, కౌన్సిలర్లు కౌడె మహేష్, తుడుం గణేష్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మర్రి నర్సింహారెడ్డి, విష్ణుచారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Similar News