ఇంటర్ విద్యార్థిని సూసైడ్..గుట్టు చప్పుడు కాకుండా గాంధీ మార్చురికి తరలింపు

సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని సూసైడ్ చేసుకున్న ఘటన

Update: 2024-12-02 09:59 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని సూసైడ్ చేసుకున్న ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా కడెం విలేజ్ కు చెందిన రఘురామ్ రెడ్డి కూతురు ప్రజ్ఞా రెడ్డి ప్రగతి నగర్ లోని ఎన్ ఎస్ ఆర్ ఇంపల్స్ రెసిడెన్షియల్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతుంది. ఈ రోజు ఉదయం 9:30 సమయంలో హాస్టల్ లోని తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కళాశాల యాజమాన్యం విద్యార్థిని మృతిని దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా గాంధీ హాస్పిటల్ కు తరలించారు.ప్రైవేటు కళాశాలలో వరుసగా జరుగుతున్న ఈ ఆత్మహత్యల ఘటనలు విద్యార్థులను ఆందోళన కల్గిస్తోంది.ఎన్ ఎస్ ఆర్ ఇంపల్స్ పేరుతో నడుపుతున్న కళాశాల భవనానికి ఇంటర్ బోర్డు అనుమతి లేనట్లు తెలిసింది.ప్రజ్ఞా రెడ్డి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News