కీసరలో అక్రమ నిర్మాణం
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి కీసరలో అక్రమ నిర్మాణాలు ఒకవైపు రాత్రికి రాత్రి పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

దిశ, కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి కీసరలో అక్రమ నిర్మాణాలు ఒకవైపు రాత్రికి రాత్రి పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కీసర గ్రామంలోని సర్వే నెంబర్ 195లో ఓ ప్లాట్ యజమాని ఏకంగా 30 ఫీట్ల రోడ్డు సైతం కబ్జా చేశాడు. ప్రభుత్వ కాంట్రాక్టర్ అంటూ ఏకంగా తన ప్లాట్ ముందు ఉన్న దాదాపు 100 గజాల రోడ్డు స్థలంను కబ్జా చేసి గేటు నిర్మించుకున్నాడు. ఆ ప్లాట్ లో నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్ నిర్మించాడు. అయినా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహించడం విడ్డూరం ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read More..