మిలటరీ కాలేజీ లో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు...హాజరైన గవర్నర్
సికింద్రాబాద్లోని తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (MCEME)లో 102వ స్నాతకోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై 36 మంది ఇంజనీరింగ్ అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : సికింద్రాబాద్లోని తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (MCEME)లో 102వ స్నాతకోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై 36 మంది ఇంజనీరింగ్ అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. DE-103, టెక్నికల్ ఎంట్రీ కోర్సులను సికింద్రాబాద్ తిరుమలగిరి లో MCEMEలో ఈ వేడుకలు జరిగాయి. సాయుధ దళాల సీనియర్ అధికారులతో సహా పలువురు సీనియర్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి ద్వారా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ శిక్షణను సజావుగా నిర్వహించినందుకు ఉపాధ్యాయులను , సిబ్బందిని విద్యార్థులను గవరన్నర్ అభినందించారు. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్. సిదానా మాట్లాడుతూ కమాండెంట్లు, గ్రాడ్యుయేట్ ఆఫీసర్లు కఠినమైన అకడమిక్ని ఎదుర్కొని సాంకేతిక సవాళ్ల పై నిరంతరం అవగాహన కలిగి ఉండాలని సూచించారు.