తాగునీరివ్వండి.. డబుల్ ఇండ్ల నివాసితుల ఆవేదన

డబుల్ బెడ్ రూ ములు ఇచ్చిన అధికారులు తాగునీరివ్వడం మరిచారు.. లబ్ధిదారులు కొన్ని నెలలుగా తాగునీరు లేక నరకయాతన అనుభవిస్తున్నారు.

Update: 2024-07-12 02:03 GMT

దిశ, మేడిపల్లి: డబుల్ బెడ్ రూములు ఇచ్చిన అధికారులు తాగునీరివ్వడం మరిచారు.. లబ్ధిదారులు కొన్ని నెలలుగా తాగునీరు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంత్రం కాదు నగరానికి కూతవేటు దూరం లో ఉన్న కార్పొరేషన్‌లోని డ బుల్ ఇండ్ల నివాసితుల పరిస్థి తి. వివరాల్లోకి వెళ్తే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్‌లోని అంబే డ్కర్ నగర్ కాలనీ, 13వ డివి జన్‌లో పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో కేటాయించారు. దీంతో చాలా కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. తాగునీటి సౌకర్యం కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం పైపు లైనులు వేయకుండా అధికారులు నిరుపేదలపై చిన్నచూపు చూస్తున్నా రు. స్థానిక కార్పొరేటర్, డిప్యూ టీ మేయర్ చొరవ తీసుకొని కార్పొరేషన్ నుంచి 10 లక్షలు తాగునీటి మరమ్మతుకు తీర్మా నం చేయించిన జలమండలి అధికారులు మొద్దునిద్రలో నిర్ల క్ష్యం వహిస్తున్నారు. అధికారు ల నిర్లక్ష్యంతో నీళ్లు లేకుండా కనీస జీవనం గడవడం కష్టతరమవుతుందని వాపోతున్నారు. ఎన్నోసార్లు జలమండలి మేనేజ ర్‌ను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడి నివాసులకు వెంటనే తాగునీరు అందించాలని కాల నీ వాసులు కోరుతున్నారు.

డబుల్ ఇండ్లకు తాగునీరు అందించండి..

అద్దె చెల్లించలేక అప్పుల పాలై ప్రభుత్వం ఇచ్చిన ఇంటిలోనైనా బత్రకడానికి వస్తే జలమండలి అధికారులు నిర్లక్ష్యం వల్ల మంచినీరు లేక అల్లాడుతున్నారు.వారి సమస్యను గుర్తించి కార్పోరేషన్ నుండి 10లక్షలతో తీర్మానం చెయించాను.కానీ పనులు జరుగలేదు.వెంటనే అధికారులు అలసత్వం వీడి టెండర్ పిలిచి నిరుపేదల దాహం తీర్చాలి.

-కొత్త లక్ష్మీ రవిగౌడ్, డిప్యూటీ మేయర్

సమస్య పరిష్కరిస్తాం..

కార్పొరేషన్ నుంచి వచ్చిన 10 లక్షలతో త్వరలో టెండర్ల ను పిలిచి మంచినీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. తొందరలోనే ప్రతి కుటుంబానికి మంచినీరు అందిస్తాం.

-మమత, బోడుప్పల్ జలమండలి మేనేజర్


Similar News