తొలిరోజు గ్రూప్ 3 పరీక్ష ప్రశాంతం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

Update: 2024-11-17 13:17 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షకు పలువురు అభ్యర్థులు హాజరవ్వగా, మరి కొందరు వివిధ కారణాల వల్ల గైర్హాజరయ్యారు. కూకట్ పల్లి లోని డిగ్రీ ప్రభుత్వ కళాశాల, అవినాష్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణ తీరుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల గదులలో తిరిగి పరిశీలించారు.

అల్వాల్ లో అదనపు కలెక్టర్...

గ్రూప్ 3 పరీక్షల నేపథ్యంలో ఆదివారం అల్వాల్ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ, ఆదర్శ్ జూనియర్ కాలేజీలలో పరీక్ష నిర్వహణను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయా..? పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారా ..? పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు మూసి ఉన్నాయా.. ? అనే విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రజావాణి రద్దు..

గ్రూప్ 3 పరీక్షల నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యంత్రాంగంతోపాటు జిల్లా అధికారులందరూ పరీక్షల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న సందర్భంగా సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్​ తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించాలని కోరారు.


Similar News