ఫేక్ కాల్స్ పై ఫిర్యాదు చేయండి

ఎవరైనా ఆగంతకులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాము అంటూ ఫోన్ చేస్తే వారిని నమ్మవద్దని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రఘునాథ స్వామి అన్నారు.

Update: 2024-11-16 15:16 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : ఎవరైనా ఆగంతకులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాము అంటూ ఫోన్ చేస్తే వారిని నమ్మవద్దని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రఘునాథ స్వామి అన్నారు. కాగా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఫేక్ కాల్స్ విషయంపై స్పందించారు. ఎవరూ కూడా అటువంటి కాల్స్​కు స్పందించవద్దని, ఉద్యోగ నియామకాలకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా మాత్రమే తెలియజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

    ఎవరైనా ఆగంతకులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాము అంటూ ఫోన్ చేస్తే వారిని నమ్మవద్దని, ఈ విషయంపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వాట్సప్ హెల్ప్ లైన్ 9440446106, టోల్ ఫ్రీ నంబర్: 1064, ఇమెయిల్: dg_acb@telangana.gov.inకు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 19న జరగబోయే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కౌన్సెలింగ్ కార్యక్రమానికి హాజరుకావాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ టి. రఘునాథ స్వామి తెలిపారు. అభ్యర్థులు వారి ఒర్జినల్ విద్యార్హత ధ్రువపత్రాలతో పాటుగా స్థానికతను తెలియజేసే సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని పేర్కొన్నారు. 


Similar News