చదివింది ఒకటి.. వైద్యం మరొకటి

ఉప్పల్ లో నకిలీ వైద్యుడు అరెస్ట్ అయిన సంఘటన ఉప్పల్

Update: 2024-09-10 09:28 GMT

దిశ,ఉప్పల్:ఉప్పల్ లో నకిలీ వైద్యుడు అరెస్ట్ అయిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి.. వైద్యుడిగా అవతారమెత్తి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఓ నకిలీ వైద్యుడు. ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతో వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతి పొంది అర్హత లేకున్నా ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న నకిలీ వైద్యుడిని స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ ఓటి) పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం పీర్జాదిగూడ బాలాజీ నగర్ లో నివసిస్తున్న చౌటుప్పల్ లింగోజిగూడెం గ్రామానికి చెందిన కొయ్యలగూడెం బిక్షపతి (40) ఉప్పల్ అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్ లో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు.

ఎంబిబిఎస్ డాక్టర్ పేరుతో పర్మిషన్ తీసుకొని మణికంఠ పాలీ క్లినిక్ గత ఐదేళ్లుగా నడుపుతున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి వైద్యుడు అవతారమెత్తాడు. అర్హత లేకున్నా అమాయక ప్రజలను నమ్మించి మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడు తున్నాడు. ఎస్ఎస్సి వరకు మాత్రమే చదివిన అతడు వైద్యుడిగా వైద్య పరీక్షలు చేస్తూ ప్రిస్క్రిప్షన్ రాస్తూ పరిసర ప్రాంతాల అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు.విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ఐ మల్లేష్ సిబ్బందితో సోమవారం క్లినిక్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నకిలీ వైద్యుడు బిక్షపతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా నకిలీ డాక్టర్ కొయ్యలగూడెం బిక్షపతిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Similar News