బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం ముంచుకొస్తుంది: సీపీఐ
బీజేపీ పాలనలో లౌకిక ప్రజాస్వామ్యం, సామజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు హరించబడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాల మల్లేష్ విమర్శించారు.
దిశ, మల్కాజిగిరి: బీజేపీ పాలనలో లౌకిక ప్రజాస్వామ్యం, సామజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు హరించబడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాల మల్లేష్ విమర్శించారు. ఆదివారం యాప్రాల్ చౌరస్తాలో జరిగిన ఇంటి ఇంటికి సీపీఐ ముగింపు సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, దేశానికీ మనుధర్మమే గొప్పదంటూ ఆర్ఎస్ఎస్ నాయకులు చెబుతున్నారని చెప్పారు. సోషలిస్ట్, సెక్యులర్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని కేంద్ర మంత్రులు సైతం చెబుతూ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడాన్ని వ్యతిరేకించారు, విద్య, వైద్యంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ రాష్టాల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. దశరథ్, రొయ్యల కృష్ణమూర్తి, తోటపల్లి శంకర్, జె.లక్ష్మి, అల్వాల్ మండల కార్యదర్శి కె సహదేవ్, సహాయ కార్యదర్శి సల్మాన్ బేగ్, మల్కాజ్గిరి మండల కార్యదర్శి టి. యాదయ్య గౌడ్, సహాయ కార్యదర్శులు కాసార్ల నాగరాజు, కె. అశోక్, కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, నాయకులు కృష్ణ యాదవ్, రవి నాయక్ స్వామి, కె. ప్రమీల, మాధవి, మహాలక్ష్మి, వి. స్వరూప, పద్మ, సంతోషి, రాధికా, రమణి, సుజాత,బి.యాదగిరి, జి.రాములు, లింగం, జె.రాములు, జె. వెంకట రమణ, చిలుమూరి ఆనంద్ రావు, సూరంపల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.