Collector Goutham : సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని

Update: 2024-07-23 13:05 GMT

దిశ,ఘట్కేసర్ : సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం ఘట్కేసర్ పట్టణంలోని కమ్యూనిటీ ఆసుపత్రి, పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ పల్లె దవఖానను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి రోగులతో మాట్లడి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు .అలాగే వార్డులలో వైద్య శిబిరాలను నిర్వహించాలని ,వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా రంగనాథ్ స్వామీ, ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ పావని, పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, కమీషనర్లు పశ్య వేమన రెడ్డి , సాబేర్ అలీ, డాక్టర్ కౌశిక్, డాక్టర్ నగేష్, డాక్టర్ శ్రావ్య, నాయకులు నల్ల వెల్లి శేఖర్ ముదిరాజ్, ఏఎన్ఎంలు ఆశావర్కర్లు,మున్సిపల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News