'బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాలి'

Update: 2023-10-11 13:56 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: శాసనసభ ఎన్నికల సమయంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బ్యాంకర్లు జాగ్రత్తా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టరేట్లోని కాంప్లెక్స్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకర్లకు, బ్యాంకు ఖాతాదారులకు ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్దేశించారు. నగదు లావాదేవీలు, రవాణ చేసేటప్పుడు తగిన ఆధాధరాలతో జరగాలని నిర్ధేశించారు. రూ.50 వేల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అందుకు తగిన రుజువులు, ధ్రువీకరణ పత్రం జతచేయాల్సిందిగా సూచించారు.

అనుమానాస్పద లావాదేవీలు ఉంటే రోజువారీగా నివేదిక సంబంధిత అధికారులకు అందచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అమోయ్ కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, లీడ్ బ్యాంక్ మేనేజర్.శ్రీనివాసులు, జిల్లాలోని బ్యాంకర్లు, నోడల్ అధికారులు, ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News