చిన్నమ్మ వేధింపులు తాళలేక....
చిన్నమ్మ పెట్టే బాధలు తట్టుకోలేని ఓ యువతి ఇంటి నుండి వెళ్లిపోయి అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : చిన్నమ్మ పెట్టే బాధలు తట్టుకోలేని ఓ యువతి ఇంటి నుండి వెళ్లిపోయి అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ బోయిన్ పల్లి మల్లికార్జున కాలనీ లో నివాసం ఉంటున్న లావణ్య (17) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అమ్మాయి తండ్రి చనిపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఇదే బోయిన్ పల్లి లో నివసిస్తున్న చిన్నమ్మ దగ్గర లావణ్య ఉంటూ చదువు కుంటుంది. ఈ క్రమంలో లావణ్య కు చిన్నమ్మ వేధింపులు ఎక్కువ కావడం తో మనస్తాపం చెందిన లావణ్య గత రెండు రోజుల క్రితం తన మేన మామ ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి బయలు దేరి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. అయితే రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన మేనమామ శుక్రవారం బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించడం తో పోలీస్ లు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా తన మేన కోడలను కావాలనే కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు.