'తెలంగాణలో బలమైన పార్టీగా బీఆర్‌ఎస్'

తెలంగాణలో బలమైన పార్టీగా బీఆర్‌ఎస్​ పార్టీ ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Update: 2023-08-30 13:56 GMT

దిశ, కూకట్​పల్లి: తెలంగాణలో బలమైన పార్టీగా బీఆర్‌ఎస్​ పార్టీ ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్​బీ కార్పొరేటర్​మందాడి శ్రీనివాస్​ రావు ఆధ్వర్యంలో డివిజన్‌కు చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్​నాయకులు బుధవారం ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్​ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కోట్లాది ప్రజల ఆదరణ కగిన పార్టీ కేవలం బీఆర్‌ఎస్​పార్టీ అని అన్నారు. బీఆర్‌స్​ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నాయకులు సైతం బీఆర్‌ఎస్​పార్టీలో చేరుతున్నారని అన్నారు.


Similar News