కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో పై బీజేపీ అభ్యంతరం.. నిరసన..

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తో పాటు బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మేడిపల్లి హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పఠనం, కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ విధానాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

Update: 2023-05-05 14:21 GMT

దిశ, మేడిపల్లి : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తో పాటు బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మేడిపల్లి హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పఠనం, కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ విధానాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి మాట్లాడుతూ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థతో పాటుసేవ, సురక్ష, సంస్కృతి పరిరక్షణ, గోహత్య నిషేధం పై పోరాడుతున్న విశ్వహిందూ పరిషత్ యువజన విభాగం అయిన బజరంగ్దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడానికి ఆయన తప్పు పట్టారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, ముస్లిం సంతృతీకరణ విధానాలను అవలంబిస్తున్నదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ హిందువుల పై చేస్తున్న అసత్య ప్రచారాలు వివక్షపూరిత వ్యాఖ్యలను హిందూ సమాజం ఖండించాలని వారు అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని హిందూ సమాజానికి విక్రం రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కూరపాటి విజయకుమార్, తిరుమలరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, అంకుషాపూర్ ఎంపీటీసీ శోభారెడ్డి, పీర్జాదిగుడా కార్పొరేషన్ అధ్యక్షుడు నమిలికొండ అనిల్ రెడ్డి, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పవన్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బీసీ మోర్చా జిల్లాఅధ్యక్షుడు గొంగళ్ళ మహేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు రామచంద్రనాయక్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News