కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వార్షిక బడ్జెట్ సమావేశం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్ పర్శన్ కృష్ణవేణి కృష్ణ అధ్యక్షతన శుక్రవారం 2023-2024 వార్షిక బడ్జెట్ సమావేశం జరిగింది.
దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్ పర్శన్ కృష్ణవేణి కృష్ణ అధ్యక్షతన శుక్రవారం 2023-2024 వార్షిక బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 67.43 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో 2023-2024 గాను పన్నుల రూపేణా వచ్చే ఆదాయం 25.50 కోట్లు, అంచనా పన్నులరూపేన వచ్చే ఆదాయం 18.93 కోట్లు, నాన్ ప్లాన్ గ్రాంట్స్ 2.30 కోట్లు, ప్లాన్ గ్రాంట్స్ 3.85 కోట్లు, 2023-2024 సంవత్సరానికి గాను ప్రారంభవిలువ 16.85 కోట్లుగా తేల్చారు. ఇందులో అంచానా వ్యయం 65.99 కోట్లు కాగా మిగులు బడ్జెట్ 1.44 కోట్లు అనంతరం కౌన్సిల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పారు.
ఈ సందర్బంగా చైర్ పర్శన్ కృష్ణవేణి కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్ అందరికి ఆమోదయోగ్యమైనదని, అన్ని ప్రాంతాల అభివృద్దే లక్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పారిశుధ్య నిర్వహణకు, తాగునీటి అవసరాలకు, డ్రైనేజి, రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. గ్రామీణ వాతావరణం కలిగిన దుండిగల్ మున్సిపాలిటీని రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతాలకు అతీతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తుడుము పద్మారావు, కమీషనర్ కే.సత్యనారాయణ రావు, కౌన్సిల్ సభ్యులు సుంకరి క్రిష్ణ, కుంటి అరుణ నాగరాజు, అమరం గోపాల్ రెడ్డి, జక్కుల కృష్ణ యాదవ్, జక్కుల విజయ శ్రీనివాస్, దాతర్ పల్లి ఆనంద్ కుమార్, బొంగునూరి రమాదేవి, ముడిమెల రాము గౌడ్, కోలా సాయిబాబా యాదవ్, బండారి మహేందర్ యాదవ్, బొంగునూరి నవిత శ్రీనివాస్ రెడ్డి, మైసగారి సుజాత వెంకటేష్, శివనూరి నవనీత మల్లేష్, ఎలుగారి సత్యనారాయణ, నర్సింగం భరత్ కుమార్, నర్సిరెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి, పీసరి బాలమని కృష్ణా రెడ్డి, పల్పునూరి మౌనికా విష్ణువర్ధన్ రెడ్డి, నాచారం సునీత మురళి యాదవ్, ఎంబరి లక్ష్మి ఆంజనేయులు, మదాస్ వెంకటేశం, అర్కెల అనంతస్వామి ముదిరాజ్, కొర్రా శంకర్, తనుగుండ్ల జోస్ఫిన్ సుధాకర్ రెడ్డి,మునిసిపల్ ఇంజనీర్ పి.ప్రవీణ్ కుమార్,టిపిఓ సాయిబాబా, జూనియర్ ఎకౌంటు ఆఫీసర్ రాజబాబు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.