దోమల నివారణకు ఏఎల్ఓ స్ప్రే

దోమలు (లార్వా) నివారణకు వైద్య సిబ్బంది చర్యలు చేపట్టారు.

Update: 2024-08-31 11:37 GMT

దిశ, పాపన్నపేట : దోమలు (లార్వా) నివారణకు వైద్య సిబ్బంది చర్యలు చేపట్టారు. పల్లెల్లో విజృంభిస్తున్న దోమలు అనే శీర్షికన శనివారం దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి వైద్య సిబ్బంది స్పందించారు. మండల పరిధిలోని చీకోడ్ గ్రామంలో ఏఎల్ఓ స్ప్రే నిర్వహించారు. అనంతరం వైద్య సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. గ్రామంలో ఎవరికైనా జ్వరం ఉందా లేదా అనే పరీక్షలు నిర్వహించారు. మండలంలోని ఏ గ్రామంలోనైనా ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సీహెచ్ ఓ చందర్, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News