పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు పీజేఆర్: కూకట్పల్లి ఎమ్మెల్యే
పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు మాజీ
దిశ, కూకట్పల్లి: పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే, కార్మిక నాయకుడు పీజేఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట్ గూడ్ షెడ్ రోడ్డు లోని పీజేఆర్ విగ్రహం వద్ద శనివారం నిర్వహించిన పీజేఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్లు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంబటి శ్రీనివాస్, కర్క పెంటయ్య, జిల్లా గోపాల్, కర్క రవీందర్, గరిగె తుకారాం, విష్ణు, జెల్ల రాము, డాకయ్య, ఇనుగంటి రాజు, శివశంకర్, రవి సింగ్, వెంకట్ స్వామి, అరుణ్, కృష్ణ, పాండు, నరేష్, సురేష్, చందు, కొండిబ, నిఖిల్, ప్రదీప్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.