రాజకీయ పట్టింపులతోనే అల్వాల్ పేదలకు ప్రభుత్వ వైద్యం దూరం : ఎంపీ ఈటల

కాంట్రాక్టర్ కు బిల్లులు రాకపోవడం, రాజకీయ పట్టింపులతోనే అల్వాల్

Update: 2024-12-28 16:10 GMT

దిశ, అల్వాల్: కాంట్రాక్టర్ కు బిల్లులు రాకపోవడం, రాజకీయ పట్టింపులతోనే అల్వాల్ పేదలకు ప్రభుత్వ వైద్యం అందలేకపోతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం ఓల్డ్ అల్వాల్ లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య శాలను రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాతల సేవా దృక్పథంతో నిర్మాణం అయిన పురాతనమైన అల్వాల్ ప్రభుత్వ వైద్యశాల నేడు పేదలకు వైద్యం అందించలేక పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ పేదలకు మంచి వైద్యం అందించేది కానీ కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడి పోయినట్లుగా పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కడితే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు అని భావిస్తే బిల్డింగ్ పూర్తి చేసి ఏడెనిమిది నెలలు కావస్తున్నా అటు కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వక ఇటు వైద్య శాల ప్రారంభించక ప్రజలకు వైద్యం అందకుండ చేస్తున్నారని తెలిపారు.

కాంట్రాక్టర్ కు డబ్బులు రాలేదని తాళాలు వేసుకోవడంతో అనేక నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయి. దీనికి ప్రత్యమయ్యంగా వెంకటాపురం కొత్త బస్తి కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక దవఖాన సమస్యలకు నిలయంగా మారిందన్నారు. అక్కడ వైద్య సిబ్బందికే వసతులు లేవు ఇక రోగుల ఎలా ఉంటాయని ప్రశ్నించారు. రాజకీయ పట్టింపులు, కాంట్రాక్టర్ కు బిల్లులు రాకపోవడం పేద ప్రజల వైద్యం పట్ల పట్టింపు లేక పోవడం బాధ కలిగిస్తుందన్నారు. ఈ రోజే వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి దీనిని వెంటనే ప్రారంభోత్సవం చేసే ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామించారు.స్టాఫ్ ను సంపూర్ణంగా నియమించడంతో పాటు అవసరమైన వైద్య పరికరాలన్ని తెప్పించి పేద ప్రజానికానికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాణిక్య రెడ్డి,మల్లికార్జున్ గౌడ్, కార్తీక్ గౌడ్, తూప్రాన్ లక్ష్మణ్,గోపి, రాజిరెడ్డి, అనిల్ రాజ్, అనిల్ కుమార్. వైద్యులు . వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Similar News