చేర్యాలలో గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్
చేర్యాల పట్టణ కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని 490 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చేర్యాల సీఐ ఎల్. శ్రీను తెలిపారు.
దిశ, చేర్యాల: చేర్యాల పట్టణ కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని 490 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చేర్యాల సీఐ ఎల్. శ్రీను తెలిపారు. మంగళవారం చేర్యాల సర్కిల్ కార్యాలయంలో ఎస్సై నీరేష్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పట్టణ కేంద్రానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు యాదవ నగర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నాడని సమాచారంతో రావడంతో సిద్ధిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు, చేర్యాల పోలీసులు కలిసి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతన్ని విచారించగా హైదరాబాద్ నుండి మిత్రుని సహాయంతో గంజాయిని తెచ్చి చేర్యాల ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు తెలిపాడని, అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించ నున్నట్లు సీఐ తెలిపారు. చేర్యాల ప్రాంతంలో వరుసగా గంజాయి కేసులు నమోదవుతున్నాయని, ఎక్కువగా యువకులే గంజాయిని సేవిస్తూ, విక్రయిస్తున్న నేపథ్యంలో పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలని, చేర్యాలను గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ శ్రీను కోరారు.