తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సంకల్పం గొప్పది..

పదేళ్లు బీఆర్ఎస్ పాలకులచే నిర్లక్ష్యం చేయబడిన తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం గొప్పదని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.

Update: 2024-11-08 09:01 GMT

దిశ, సంగారెడ్డి బ్యూరో : పదేళ్లు బీఆర్ఎస్ పాలకులచే నిర్లక్ష్యం చేయబడిన తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం గొప్పదని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం జుబ్లీహిల్స్ లోని నివాసంలో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చమిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నారని, తెలంగాణ సంక్షేమం అభివృద్ధికి పాటు పడుతున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. గత పాలకులచే నిర్లక్ష్యం చేయబడిన రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నాడని కొనియాడారు.

గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి పర్యాద పదంగా పాలన కొనసాగిస్తున్న రేవంత్ సర్కారుకు ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తుందన్నారు. ఆ ప్రజల మద్దతుతోనే మూసీ ప్రక్షాళనకు సీఎం ముందడుగు వేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ యావత్ ప్రజానీకం ఆశీస్సులతో మూసీ పునరుద్ధరణ సక్సెస్ అవుతుందని నీలం మధు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మధు ఆశాభావం వ్యక్తం చేశారు.


Similar News