ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పని చేయాలి
ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పని చేయాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.
దిశ, మెదక్ టౌన్ : ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పని చేయాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే వినాయక పండుగకి తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి వివరించారు. జిల్లాలో తమ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక గ్రామాలను పోలీస్ అధికారులు సందర్శించాలని, ట్రబుల్ మాంగర్స్, తరచుగా తగాదాలకు, నేరాలకు పాల్పడేవారి పై నిఘా ఉంచాలని అన్నారు. పీస్ కమిటీ మీటింగ్ లు ఏర్పాటు
చేసి మండపాల నిర్వాహకులతో మాట్లాడాలని అన్నారు. ఆదే విధంగా జిల్లాలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల్లో హాట్ స్పాట్ లను ఏర్పాటు చేసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రైమ్ మ్యాపింగ్ తయారు చేసి అక్కడ నేరాల నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యలను తెలిపారు. అలాగే గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని, ఏ ఏ అంశాలు కోడీకరించాలి తదితర అంశాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పని చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా ఛేదించాలనీ, కేసుల ఛేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలని
కోరారు. రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర వర్టికల్, విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ వారి పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ, సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ వెంకట రెడ్డి, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్ర బోస్, జిల్లా సీఐ లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.