తాగునీటి కోసం గ్రామపంచాయతీ ముందు మహిళల నిరసన

Update: 2024-08-16 12:00 GMT

దిశ, కొల్చారం: కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ లో నెల రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తక్షణమే నీటీ సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. పిల్లలను పాఠశాలకు పంపాలంటే నీళ్ళు లేక స్నానాలు చేయించడం లేదన్నారు. సరైన వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోవడంతో గ్రామంలో నీటి నీటి ఎద్దడి ఏర్పడింది.ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News