భూ నిర్వాసితులను ఆదుకుంటాం

జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు కానున్న పరిశ్రమల కోసం భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులను ఆదుకుంటామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు.

Update: 2024-08-20 16:17 GMT

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు కానున్న పరిశ్రమల కోసం భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులను ఆదుకుంటామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సెట్విన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి సన్మాన సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతలో నైపుణ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. విద్యా , వైద్యం, ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి మండలానికి నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణమని, మహిళలను నేతలు గౌరవించాలన్నారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు ఆనంద్ మహేంద్ర చైర్మన్గా

    నామినేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ప్రారంభించారని, జహీరాబాద్ ప్రాంతంలో భారీ ఎత్తున కంపెనీలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. అందుకు అవసరమైన నైపుణ్యాన్ని యువతలో కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జహీరాబాద్ ప్రాంతం అనాదిగా కాంగ్రెస్ కు కంచుకోటలా ఉందన్నారు. ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మర్చిపోదని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో 500 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. రైతుల రుణమాఫీకి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని, అందరికీ రుణమాఫీ వర్తించేలా అవసరమగు చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి కానుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో 12,600 ఎకరాల భూమిలో రూ.2,50,000 వేల కోట్ల పెట్టుబడులు నిమ్స్ లో రానున్నాయన్నారు. టీఎస్ఐడీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయన్నారు. ప్రతి ఒక్క భూనిర్వాసిత కుటుంబానికి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.

హరీష్ రావు రాజీనామా చేయాలి : మాజీమంత్రి చంద్రశేఖర్

రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే పదవికి రాజీనామా చేస్తానన్న హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని నియోజకవర్గ ప్రజలతో కలిసి మాజీమంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వమిచ్చిన గ్యారంటీ, హామీలన్నీ అమలవుతున్నాయన్నారు. నూతనంగా ఎన్నికైన సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి ప్రత్యేకంగా జహీరాబాద్ కు 15 బస్సులు తేవాలని కోరారు. ప్రతి మండలానికి రెండు చొప్పున, జిల్లా కేంద్రానికి మరో ఐదు బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. తెలుగుదేశం కాలంలో తాను ఆకుపచ్చ పచ్చపసులను అందుబాటులోకి తెచ్చానన్నారు. పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ , టీఎస్ఐడీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తదితరులు మాట్లాడుతూ

    పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ ప్రాంత యువతలో స్కిల్ డెవలప్మెంట్ కు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు. జహీరాబాద్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు మంత్రి చొరవచూపాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కంపెనీ కూడా జహీరాబాద్ కు తీసుకురాలేదని ఉన్న నిమ్స్ భూసేకరణకు కోసం నిధులు కేటాయించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింహులు అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన సభలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, నాయకులు, ప్రతినిధులు నర్సింహారెడ్డి , హనుమంతరావు పటిల్, ఖాజా మియా, రామలింగారెడ్డి, మక్సూద్ , ఎంజీ. రాములు, మంకాల్ సుభాష్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి , మురళీకృష్ణ గౌడ్, నరేష్, చంద్రప్ప, నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చుతూ భారీ ఊరేగింపు నిర్వహించారు. 

Tags:    

Similar News