కూడవెల్లిని అభివృద్ధి చేస్తాం : దుబ్బాక ఎమ్మెల్యే
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి,అక్బర్ పేట-భూంపల్లి ఉమ్మడి మండలాల పరిధిలోని కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
దిశ, అక్బర్పేట్,భూంపల్లి : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి,అక్బర్ పేట-భూంపల్లి ఉమ్మడి మండలాల పరిధిలోని కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మాఘ అమావాస్య సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణ కాశీగా పిలవబడే శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రసాద స్కీం లో చేర్చడం ద్వారా త్వరలోనే కేంద్ర, రాష్ర్ట మంత్రులతో అభివృద్ధి పనులను ప్రారంభింప చేస్తామని తెలిపారు. ఆయనతో పాటు బీజేపీ శ్రేణులు, భక్తులు ప్రత్యేక పూజకార్యక్రమంలో పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నేటి నుండి జరిగే జాతర లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, బీ ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.