'న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా పని చేయాలి'

Update: 2023-03-19 13:23 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగేలా పని చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో అదనపు సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. రఘురాం తో కలిసి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ జోడెడ్ల బండి లాంటిదని న్యాయ మూర్తులు, న్యాయ వాదులు సమన్వయంతో నడిపిస్తేనే కక్షిదారులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. న్యాయవాదులు అనవసర వాయిదాలు పోకుండా కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అదనపు సివిల్ జడ్జి కోర్టు భవన ప్రారంభం సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి భవాని, సీనియర్ సివిల్ జడ్జి స్వాతి రెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సల్మా ఫాతిమా, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రావణి యాదవ్, న్యాయ మూర్తులు సౌమ్య, ప్రియాంక, శివరంజని, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీసీపీ మహేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, న్యాయ వాదులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News